నూతన ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే

18-11-2026 | 06:10pm

చిన్నారులు, బహుళ వైద్య సేవలతో సంజీవని ఆసుపత్రి ఏర్పాటు

సత్తుపల్లి. నవంబర్ 18. ( విజయ క్రాంతి ): సత్తుపల్లి మున్సిపాలిటీ(Sattupalli Municipality) పరిధిలోని నేతాజీ రోడ్డులో ఏర్పాటు చేసిన సంజీవని చిన్నారులు, బహుళ వైద్య ప్రత్యేకతల నూతన ఆసుపత్రిని సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి(MLA Dr. Matta Ragamayi), రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ రిహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె చెన్నారావు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు