కూసుమంచి ఎస్సైగా సతీష్ బాధ్యతల స్వీకరణ
16-10-2026 | 12:14pm
కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా సతీష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహించిన నాగరాజు బదిలీపై కల్లూరుకు వెళ్లడంతో ఆయన స్థానంలో సతీష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై సతీష్కు అభినందనలు తెలిపి స్వాగతం పలికారు. బదిలీపై వెళ్తున్న ఎస్సై నాగరాజును సిబ్బంది సన్మానించారు. విధుల నిర్వహణలో ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.