వెంకన్న సన్నిధిలో మంత్రి పొంగులేటి జన్మదిన సంబరాలు
ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు
కూసుమంచి, అక్టోబర్ 28(విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కూసుమంచి మండలం(Kusumanchi Mandal) జీళ్ళచెరువు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో(Venkateswara Swamy Temple) స్థానిక కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచి మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.. అనంతరం దేవాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరుతో ప్రత్యేక పూజలు(Special prayers) చేశారు. మంత్రి ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. మంత్రి పొంగులేటి వల్లనే పాలేరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ అంబాల లింగయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొక్క ఉపేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొండా శ్రీనివాస్ రావు , సోషల్ మీడియా మండల అధ్యక్షుడు బెజవాడ శ్రీకాంత్, సీనియర్ జర్నలిస్ట్ పెండ్ర అంజయ్య, మాజీ ఎంపీటీసీ కాసాని వెంకన్న, కిషోర్, చంటి, వీరబాబు, అర్చకులు పాల్గొన్నారు.