రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌కు రజతం
ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఎస్‌జీఎఫ్ అండర్(SGF Under)-19 రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీల్లో(State-level Netball Competition) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలుర జట్టు(Adilabad District Boys' Team) రజత పతకం సాధించింది. మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District) నారాయణపేట మండలం కొండాపూర్‌లో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల ఆసిఫాబాద్ ప్రిన్సిపాల్ దుర్గం మహేశ్వర్, సీనియర్ ఉపాధ్యాయులు మరాటి మల్లేష్, ఫిజికల్ డైరెక్టర్ బి. తిరుపతి, ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు.