మైనారిటీ నాయకులకు ఘన సన్మానం

28-10-2026 | 01:48pm

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ(Asifabad Municipality) ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో నూతనంగా జిల్లా మైనారిటీ సెల్(District Minority Cell) వైస్ చైర్మన్లుగా ఎన్నికైన ఎం.ఏ. రఫీక్ (రఫ్ఫు), మొహమ్మద్ సాజిద్, జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ కలీమ్‌లను మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా  ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ఉబైద్ బిన్ యాహియా (తారిక్), మాజీ కోఆప్షన్ సభ్యుడు అమాన్ భాయ్, తన్వీర్ అహ్మద్, మొహమ్మద్ షఫీ, మొహమ్మద్ సఫన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు