ప్రజలు ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు
కాగజ్ నగర్ ,అక్టోబర్ 28 ( విజయ క్రాంతి): లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్, ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు(MLA Dr. Palvai Harish Babu) అన్నారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ ఆవరణలో కొనసాగుతున్న ఉచిత వైద్య శిబిరం బుధవారం నాటికి 13 వ రోజుకు చేరుకుంది.
ఈనెల 28 వ తేదీ నుంచి 31 వరకు ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీలకు సంబంధించిన వైద్య సేవ లు అందిస్తున్నారు. అలాగే వైద్య శిబిరానికి సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజక వర్గాల్లోని వివిధ మండలాల నుంచి వచ్చిన రోగులు, వారి బంధువులు, వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.