మరుగుదొడ్డి.. వసూళ్ల దందా?

08-10-2026 | 05:15am

జీతం ఇస్తున్నా డబ్బుల వసూలుపై ఆరోపణలు

జైనూర్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): జైనూర్ బస్టాండ్(Jainoor Bus Stand) పరిధిలోని మార్కెట్యార్డు ఆవరణలో(Market yard premises) ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్డి నిర్వహణపై(Toilet maintenance) విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామపంచాయతీ ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెబుతున్న ఈ మరుగుదొడ్డి(Toilet maintenance) వద్ద ప్రయాణికుల నుంచి నగ దు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా అక్కడ పనిచేసే వ్య క్తికి గ్రామపంచాయతీ తరఫున నెలకు రూ.4 వేల వరకు వేతనం చెల్లిస్తున్నప్పటికీ, వినియోగదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

నగదు ఉంటేనే అనుమతి?

ఇటీవల మరుగుదొడ్డిని వినియోగించుకునేందుకు వెళ్లిన ఓ ప్రయాణికుడి వద్ద నగదు లేకపోవడంతో ఫోన్పే ద్వారా చెల్లిస్తానని చెప్పగా, నిర్వాహకుడు డిజిటల్ చెల్లింపు తీసుకోకుండా నగదు ఇస్తేనే లోపలికి అనుమతిస్తానని చెప్పినట్లు ప్రయాణికుడు ఆరోపించాడు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో మరుగుదొడ్డిని వినియోగించుకోవాల్సిన ప్రయాణికులు ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. నిర్వాహకు డు దురుసుగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

మహిళలకు తప్పని ఇబ్బందులు

మరుగుదొడ్ల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో మహిళలు, చిన్నారులు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. దుర్వాసన, పారిశుధ్య లోపాలతో బస్సుల కోసం వేచి ఉండే ప్ర యాణికులు ఇబ్బందులు పడుతున్నారని పే ర్కొంటున్నారు. మరుగుదొడ్లను నిత్యం శు భ్రపరిచి, తాగునీరు, నీటి సదుపాయాలు  స క్రమంగా కల్పించాలని కోరుతున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఏదీ?

ప్రయాణికుల సౌకర్యార్థం గ్రామపంచాయతీ నిధులతో నిర్మించి నిర్వహిస్తున్న మ రుగుదొడ్డి వద్ద వసూళ్లు జరుగుతున్నాయ న్న ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పంచాయతీ నుంచి సిబ్బందికి వేతనం చెల్లిస్తున్నట్లయితే, ప్రయాణికుల నుంచి వసూళ్లు ఎందుకు జ రుగుతున్నాయో స్పష్టం చేయాలని డిమాం డ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను నిర్ధారిం చి, అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసి ప్రయాణికులకు సౌకర్యవంతమైన, పరిశుభ్రమైన మరుగుదొడ్డి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు