గంజాయి సేవించిన వ్యక్తిపై కేసు నమోదు
బెజ్జంకి, అక్టోబర్ 28: బెజ్జంకి పోలీస్‌స్టేషన్(Police station) పరిధిలోని వడ్లూరు గ్రామ శివారు నుంచి ఖాసీంపేటకు వెళ్లే మార్గంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అన్నాడి కల్యాణ్ రెడ్డి(Annadi Kalyan Reddy) (27) అనే వ్యక్తిని తనిఖీ చేయగా గంజాయి సేవించినట్లు(consumed cannabis) గుర్తించారు. పరీక్షలో ఫలితం పాజిటివ్‌గా రావడంతో ఎన్డీపీఎస్ చట్టం(NDPS Act) కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.
యువతతో పాటు ప్రజలందరూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి అక్రమ వినియోగం లేదా సరఫరా గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై తోట తిరుపతి కోరారు.