చేపల మార్కెట్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన
కాగజ్ నగర్ నవంబర్ 27 ( విజయక్రాంతి) : చేపల మార్కెట్(fish market) ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేస్తున్నట్లు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు(Sirpur MLA Dr Harish Babu) తెలిపారు. శుక్రవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) కాగజ్ నగర్ మండలంలోని నజరుల్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ స్థలాన్ని(Government land) ఎమ్మెల్యే స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించారు. కాగజ్నగర్ పట్టణం, మండల ప్రజలకు అందుబాటులో ఉండే ఈ చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా ప్రతిపాదించిన మాడ్రన్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ద్వారా ప్రతిపాదించిన మోడ్రన్ ఫిష్ మార్కెట్ కోసం 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు వెంట గ్రామపంచాయతీ సర్పంచ్ బికాస్ గారామి, ఎంపీడీవో సిహెచ్ ఉజ్వల కుమార్, ఏపీవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.