జైత్రం తండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ

27-11-2026 | 06:38pm

చేగుంట నవంబర్ 27,విజయక్రాంతి: మండలంలోని జైత్రం తండా గ్రామ(Jaitram Thanda village) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిన్నారెడ్డి, గ్రామ సర్పంచ్ ధారవత్ సుభాష్ నాయక్ పాల్గొని విద్యార్థులకు తమ చేతుల మీదుగా ప్లేట్లను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి అవసరమైన వసతులు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రకాష్, హౌసింగ్ ఏఈ రియాజుద్దీన్, మిషన్ భగీరథ అధికారి దివ్యశ్రీ, ఏపీఓ శ్వేత, వ్యవసాయ అధికారులు హరిప్రసాద్, కళ్యాణి, ఆశా వర్కర్లు ప్రేమిల, పద్మ, రెవెన్యూ శాఖకు చెందిన గోపాల్, పంచాయతీ కార్యదర్శి రాధా, ఉపసర్పంచ్ రాజేందర్, వార్డు సభ్యులు గణేష్, అనిత, మోహన్, హస్లీ, ఇతర మండల స్థాయి అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు