సర్వాయి పాపన్న స్ఫూర్తిని చాటుదాం

27-11-2026 | 06:36pm

విగ్రహావిష్కరణకు తరలిరండి!

ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు 

సుల్తానాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): సామాజిక సమానత్వం(Social Equality), ఆత్మగౌరవం, పోరాట పటిమకు ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్(Sardar Sarvai Papanna Goud) ఆశయాలను చాటిచెప్పేలా ఈ నెల 29వ ఆదివారం సుల్తానాబాద్ మండల(Sultanabad Mandal) కేంద్రంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించ నున్నారు. పట్టణంలోని పాత జెండా వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గౌడ సంఘం నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు(Peddapalli MLA Chintakunta Vijayaramana Rao) ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి గోపగాని సారయ్య గౌడ్, వేగోళం అబ్బయ్య గౌడ్ తెలిపారు.సర్వాయి పాపన్న గౌడ్ కేవలం ఒక సామాజిక వర్గానికే కాకుండా సమాజంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని వారు పేర్కొన్నారు. ఆయన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి, సమాజం కోసం చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఆయన చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే సంకల్పంతో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి మండల, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవం తం చేయాలని వారు పిలుపుని చ్చారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు అంతటి లచ్చయ్య గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, వేగోళం శ్రీనివాస్ గౌడ్, పొన్నం తిరుపతి గౌడ్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, కేక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, పొన్నం చంద్రయ్య గౌడ్, అంతటి సాగర్ గౌడ్, కొయ్యడ రమేష్ గౌడ్, పోడేటి వెంకటేష్ గౌడ్, బైరగోని ప్రభాకర్ గౌడ్, బండి సంపత్ గౌడ్, అంతటి సంతోష్ గౌడ్, అన్నపురం శ్రీనివాస్ గౌడ్, వీరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు