మెడికల్ స్టూడెంట్ కు బస్సు సదుపాయం
27-11-2026 | 06:43pm
నిర్మల్ నవంబర్ 27 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలలో(Medical College) విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల రవాణాకు బస్సు సదుపాయం కల్పించారు. హాస్టల్ నుండి మెడికల్ కళాశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బస్సులు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. అంతకుముందు పూజలు చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియో చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల సిబ్బంది విద్యార్థులు ఉన్నారు.