జాతీయ పోలీస్ డ్యూటీ మీట్ కు ఎంపికైన మానుకోట పోలీసులు
మహబూబాబాద్ టౌన్: 3వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్లో(Telangana State Police Duty Meet) మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) పోలీస్ సిబ్బంది ప్రతిభ చాటి సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించి జాతీయస్థాయికి ఎంపికైన ముగ్గురు పోలీస్ సిబ్బందిని ఎస్పీ డాక్టర్ శబరిష్(SP Dr. Sabarish) శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ నెల 23వ తేదీ నుంచి 26 వరకు నిర్వహించిన 3వ తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్లో(Telangana State Police Duty Meet) వివిధ విభాగాల్లో పోటీపడి మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎస్ ఐ సీ హెచ్. అరుణ్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించారు. కానిస్టేబుల్ జీ.అశోక్ బ్రాంజ్ మెడల్ సాధించారు.
కానిస్టేబుల్ కే. అంజయ్య అసిస్టెంట్ కోచ్‌గా సేవలందించి ప్రతిభ కనబరిచారు. వచ్చే నెల డిసెంబర్ 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించనున్న 70వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ(Telangana State Police Department) తరఫున పాల్గొనే అవకాశం దక్కించుకోవడం జిల్లా పోలీసులకు గర్వకారణమని ఎస్పీ అభినందించారు.