కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లవయ్య మృతి

27-11-2026 | 06:42pm

అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుక సతీష్

సుల్తానాబాద్: నవంబర్ 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు(Congress Party ideologies) కట్టుబడి మూడు దశాబ్దాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన సీనియర్ నాయకుడు వడ్లూరి లవయ్య(Vadluri Lavaiah) మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా(Peddapalli district) సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామ అంబేద్కర్ కాలనీకి చెందిన వడ్లూరి లవయ్య(Vadluri Lavaiah) అనారోగ్యంతో మృతి చెందగా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుక సతీష్, మాజీ ఎంపీటీసీ మండల రమేష్ తోపాటు ప్రజాప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోస్తూ నివాళులర్పించారు.

కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ కోసం లవయ్య చేసిన సేవలు, ప్రజలతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొంటూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంత్యక్రియల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు