జామ్నిలో ఘనంగా దండారి వేడుకలు

06-11-2026 | 05:28pm

జైనూర్ (విజయక్రాంతి): జైనూర్ మండలం జామ్ని గ్రామంలో ఆదివాసీల సంప్రదాయ పండుగ దండారి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Lakshmi) ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులతో కలిసి దండారి నృత్యంలో పాల్గొన్నారు. గోండు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా యువకులు, మహిళలు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆదివాసీ సంఘాల నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు