పోషకాహారంపై గర్భిణీలకు అవగాహన

07-10-2026 | 03:14pm

ఆసిఫాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): వట్టివాగు కాలనీలోని దిశా మోడల్ పాఠశాల(Disha Model School) ఆవరణలో బుధవారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీఆర్పీ రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తదితర పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు.అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎస్. సుజాత,సర్పంచ్ ఆత్రం ఈశ్వరిబాయి,ప్రధానోపాధ్యాయుడు కుమరం మాధవరావు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు