బి.హెచ్.ఇ.ఎల్ వారి పై చర్యలు తీసుకోవాలి

07-10-2026 | 04:25pm

మాకు న్యాయం కావాలి:స్నేహ సొసైటీ భాధితులు

రామచంద్రపురం ఆగస్టు 07: రామచంద్రపురం డివిజన్(Ramachandrapuram Division) పరిధిలోని మాక్స్ సొసైటీ ఆవరణలో స్నేహ సమాజం(Sneha Society members) వారి భూమి ప్రహారిణి కుల్చివేసిన బి.హెచ్.ఇ.ఎల్ యజమాన్యం. బీ.హెచ్ఈఎల్ యాజమాన్యంపై సొసైటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. తాము కొనుగోలు చేసుకున్న 3 ఎకరాల 31 గుంటల భూమిలో కాంపౌండ్‌ను రెండు రోజుల క్రితం బీహెచ్ఈఎల్ అధికారులు తొలగించారని ఆరోపించారు.

తప్పుడు సర్వే మ్యాప్, రిపోర్ట్ ఆధారంగా ఈ చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు.. బీహెచ్ఈఎల్ సంస్థలో 40 ఏళ్లపాటు పనిచేసిన ఉద్యోగులుగా తమకు కేటాయించిన భూమిలోనే ప్లాట్లు కొనుగోలు చేసుకున్నామని, తాము ఎక్కడా భూమిని ఆక్రమించలేదని స్పష్టం చేశారు.. 2014లో ఎకరాకు రూ.90 లక్షల చొప్పున భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుండటంతో పాటు తమకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉందని, అయినప్పటికీ కాంపౌండ్ తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.. ఈ-సర్వే రికార్డులను పరిశీలించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, బీహెచ్ఈఎల్ అధికారులను కోరారు. సమావేశంలో సైలూ, నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌రావు, ఏవీ రాజు, నాగరాజు, నర్సయ్య, రామచంద్రన్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు