ఔషధ మొక్కల వినియోగంపై సర్వే...
తాడ్వాయి,అక్టోబర్,07( విజయ క్రాంతి ): ఔషధ మొక్కల(Medicinal Plant Survey) వినియోగం వాటి ప్రాధాన్యతపై అధికారులు సర్వే నిర్వహించారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం నందివాడ గ్రామంలో బుధవారం ఐ సి ఎఫ్ ఆర్ ఇ,అటవీ జీవవైవిద్య సంస్థ ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహించారు.
భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాదులోని ఐ సి ఎఫ్ ఆర్ ఇ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ శాస్త్రవేత్తలు గృహ సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు నిత్యజీవితంలో ఉపయోగిస్తున్న ఔషధ మొక్కలు అడవుల నుండి వాటిని సేకరించే విధానాలు,
స్థానికంగా లభ్యమయ్యే వివిధ రకాల వనమూలికల వివరాలను ఈ సర్వే ద్వారా సేకరిస్తున్నట్లు తెలిపారు.సర్వేతో దేశవ్యాప్తంగా స్థానికంగా ఔషధ మొక్కలకు ఉన్న డిమాండ్ సరఫరా అంచనాలను స్పష్టంగా తెలుసుకోవడానికి ఈ సర్వేను నిర్వహిస్తున్నామన్నారు.
ఈ ప్రాజెక్టు సర్వే ఆధారంగా భవిష్యత్తులో ఔషధ మొక్కల సంరక్షణకు గిరిజన గ్రామీణ ప్రజల ఆర్థిక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఐసిఎఫ్ఆర్ఈ శాస్త్రవేత్త పంకజ్ సింగ్, సంస్థ ప్రతినిధులు సుమన్, శ్రీనివాస్,నందకుమార్, ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది వినోద్, కళ్యాణి, సర్పంచులు సంకు పోచయ్య,రేణుక గణపతి, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.