ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో డాక్టర్ మట్టా
సత్తుపల్లి, అక్టోబర్ 7:( విజయ క్రాంతి ): సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామానికి చెందిన ఏసూరి లక్ష్మి నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్(State Congress leader Dr. Matta Dayanand Vijay Kumar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన గృహాన్ని సందర్శించి, గృహ యజమాని ఏసూరి లక్ష్మి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, బేతుపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.