అన్నప్రాసన వేడుకకు విచ్చేసిన డాక్టర్ మట్టా
వేంసూర్ సత్తుపల్లి. అక్టోబర్ 7. ( విజయ క్రాంతి ): వేంసూరు మండలం లచ్చన్నగూడెం గ్రామానికి (Lacchannagudem Village)చెందిన కంచర్ల సునీల్–శాంతి దంపతుల కుమారుడు చి. క్రిష్విత్ అన్నప్రాసన వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ (State Congress leader Dr. Matta Dayanand Vijay Kumar ) హాజరై చిన్నారి క్రిష్విత్‌ను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎంసీ చైర్మన్ దోమ ఆనందబాబు, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.