బాధితులకు పరామర్శ.. ఓదార్పు..
తాడ్వాయి,అక్టోబర్,07( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో మంగళవారం రాత్రి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao ) బాధితులను పరామర్శించి ఓదార్చారు.ఈ సందర్భంగా ఆయన తాడ్వాయి మండల కేంద్రంలో, ఏండ్రియాల్ గ్రామాలలో వివిధ కారణాలతో గాయపడిన బాధితులను,ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాధితుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, నాయకులు మహేందర్ రెడ్డి,శ్యామ్ రావు, మేకల రాజు,సుధాకర్ రావు, వెంకట్ రెడ్డి, శివాజీ, రాజలింగం, మోహన్ రెడ్డి,షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు.