వేగవంతంగా పంచాయతీ భవన నిర్మాణం పనులు...

07-10-2026 | 04:32pm

తాడ్వాయి,అక్టోబర్,07( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలోని గ్రామపంచాయతీ భవన నిర్మాణ(Construction of Gram Panchayat building) పనులు నత్తనడకన సాగాయి. సదరు కాంట్రాక్టర్ పిల్లర్లు నిర్మించి అలాగే వదిలేసి కొన్ని నెలల పాటు నిర్మాణ పనులు చేయకుండా వదిలేశారు.

ఈ విషయమై సెప్టెంబర్ 29న విజయ క్రాంతిలో ప్రచురితమైన నత్తనడకన గ్రామపంచాయతీ భవన నిర్మాణం అనే కథనానికి అధికారులు,కాంట్రాక్టర్ స్పందించారు. భవనిర్మాణ పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. విజయ క్రాంతిలో కథనం ప్రచురితం చేసినందుకు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు