ఉద్రిక్తత.. కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య వార్

07-10-2026 | 04:13pm
సిద్దిపేట, అక్టోబర్ 7: బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) నాయకుల మధ్య ఘర్షణతో సిద్దిపేటలో ఉద్రిక్తత నెలకొంది. మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. అదే సమయంలో రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ నాయకులు మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించడాన్ని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన పరిస్థితి

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇరు వర్గాలకు చెందిన వారిని Police Station‌కు తరలించారు. ఘర్షణ నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు పార్టీల నాయకులు తమ తమ కార్యక్రమాలపై కొనసాగుతుండగా, ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు పరిస్థితిని Monitor చేస్తున్నారు.

మరిన్ని వార్తలు