సీఈసీపై విపక్షాల నిరసన.. బస్సుల్లో జంతర్ మంతర్‌కు

07-10-2026 | 04:43pm

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద నిరసన చేపట్టాలని విపక్ష ఎంపీలు నిర్ణయించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) సహా పలువురు విపక్ష ఎంపీలు ఢిల్లీలోని సాగర్ రత్న హోటల్ నుంచి బస్సుల్లో జంతర్ మంతర్ వైపు బయల్దేరారు. సుమారు 300 మంది వరకు విపక్ష ఎంపీలు నిరసనలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల సంఘం(Election Commission) వ్యవహారశైలిపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా(CEC Gyanesh Kumar Resigns) చేయాలని కూడా విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన నిరసనలో రాహుల్ గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. మంగళవారం జరిగిన పరిణామాల తర్వాత మరుసటి రోజే విపక్షాలు మరోసారి నిరసనకు పిలుపునివ్వడం ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జంతర్ మంతర్ వద్ద భద్రతా ఏర్పాట్లను పోలీసులు ముమ్మరం చేసినట్లు కూడా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు