అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

07-10-2026 | 04:12pm

ఆసిఫాబాద్, అక్టోబర్ 7(విజయ క్రాంతి): జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్(District Additional Collector Yuvaraj Marmat) అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

గ్రామ సమాఖ్య, గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. చేయూత పింఛన్ల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితా రూపొందించాలని, స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.

మరిన్ని వార్తలు