186 వ రోజు కార్మికుల దీక్షలు
21-11-2026 | 04:54pm
కాగజ్ నగర్,(విజయక్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్ కార్మికులు(Sirpur Paper Mill Workers) చేస్తున్న రిలే దీక్షలు శనివారం నాటికి 186 వ రోజుకు చేరుకున్నాయి.
పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికలు జరిపించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈనాటి దీక్షలో ఎస్ పి ఎం కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ గోగర్ల రాములు, ఏఐటీయూసీ నాయకులు ఏకే సింగ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.