పోలీసులు ఎల్లప్పుడు ప్రజా సేవకులే..!

21-11-2026 | 04:43pm

ఎస్ .ఐ  సంధ్యారాణి

కాగజ్ నగర్ ,నంబర్ 21 ( విజయక్రాంతి): పోలీసులు(Police) ఎల్లప్పుడు ప్రజాసేవలో కొనసాగుతారని.. ప్రజలు తమ  సమస్యలను పోలీసులకు తెలుపాలని కాగజ్ నగర్ రూరల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జి .సంధ్యారాణి(G. Sandhyarani, Sub-Inspector of Police, Kagaznagar Rural) అన్నారు. శనివారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) కాగజ్ నగర్ మండలంలోని బారెగూడ గ్రామపంచాయతీ ప్రజలతో మమేకం (ఇంటరాక్ట్) అయ్యారు. గత 2 రోజుల క్రితం ఎస్ఐగా బాధ్యతలు  స్వీకరించిన ఆమె గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు, బాలిక, మహిళల సమస్యలు , సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బారెగూడ గ్రామపంచాయతీ సర్పంచ్ కోట వేణుగోపాల్, ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు