జీవిత భీమాతో భరోసా

21-11-2026 | 04:48pm

బెల్లంపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల తోపాటు, జీవిత భీమాతో ఇందిరమ్మ కుటుంబాలకు భరోసా  కలిపిస్తున్నదని బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి రమేష్ బాబు, డీసీసీ అధ్యక్షుడు పి రఘునాథ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని సుభాష్ నగర్ 7వార్డు లో ఇందిరమ్మ కుటుంబాల జీవిత బీమా పథకాన్ని(Life Insurance Scheme) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. 

ప్రజలు సన్నబియ్యంతో ఆత్మగౌరవంగా బ్రతుకుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వలేదు విమర్శించారు. రేషన్ కార్డులు(Ration cards), పెన్షన్లు కూడా సరిగా  ఇవలేకపోయిందన్నారు. పేద ప్రజలు సొంతింటి కలను నిజంచేయలేక పోయారని  దుయ్యబట్టారు. జీవిత భీమా పథకాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికల కు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. అన్ని రంగాల సంక్షేమంలో ముందున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటూనే సంక్షేమ,అభివృద్ధి పథకాలు సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్నాడని వెల్లడించారు. ఈ సందర్భంగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాని  ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కుటుంబ జీవిత బీమా కోసం  ప్రతి ఒక్కరూ దరఖాస్తులు  చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ రమేష్, కౌన్సిలర్లు మూర్తి, చింత వసంత, గాలి శ్రీనివాస్, దామర శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ సముద్రాల లావణ్య నేతలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు