సిరిసిల్ల సభ ప్రకటనపై హర్షం: వరలక్ష్మికే ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలి
జనగామ, నవంబరు 21 (విజయక్రాంతి): సిరిసిల్ల(Sircilla) సభలో ముఖ్యమంత్రి పద్మశాలిలకు(Chief Minister Padmasali) గవర్నర్ కోటా ఎమ్మెల్సీ(MLC under the Governor's quota) ప్రకటించడం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి(Telangana State Padmasali) బిడ్డలకు ఎంతో ఆనందాయకమైన గొప్ప విషయమని పద్మశాలి సంఘాల నాయకులు అన్నారు. 22 సంవత్సరాలు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ వస్తున్న మచ్చ వరలక్ష్మి, గతంలో తరిగొప్పుల మండల కేంద్రంలో సర్పంచ్ గా కూడా పోటీ చేసింది. 2004లో టీడీపీ నుంచి టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్ గా నిలబడి తన ఊరి ప్రజల మద్దతుతో ముందుకు సాగిన వరలక్ష్మి(Varalakshmi), కాంగ్రెస్ పార్టీ(Congress Party) మీద అభిమానంతో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పలికి సర్పంచ్ గా గెలిపించింది.
గెలిచే అవకాశం ఉన్నా కూడా పార్టీ కోసం త్యాగం చేసిన గొప్ప మహిళ ఆమె. పదవుల కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం, పార్టీ మనుగడ కోసం కష్టపడే మనస్తత్వం వరలక్ష్మిది. ఏ బాధ్యత ఇచ్చినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎంత దూరమైనా వెళ్లి పార్టీ ఇచ్చిన బాధ్యతను పటిష్టంగా నెరవేర్చే నాయకురాలు ఆమె. ప్రతి పాదయాత్రలో, ప్రతి కార్యక్రమంలో ముందుండి నడిచిన వరలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రేటర్ పరిధిలో 24 కి పైగా ప్రొటెస్టులు చేసిన అనుభవం కలిగిన నాయకురాలు.
మహిళా కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలిగా మహిళల పట్ల నిబద్ధతతో మాటలో గాని, పనిలో గాని తన బాధ్యతను నెరవేర్చింది. పీసీసీ బాధ్యతలో కూడా చురుకైన రీతిలో పార్టీ కోసం కష్టపడుతోంది. అందుకే పార్టీలో కష్టపడి పనిచేసిన మహిళగా వరలక్ష్మిని గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని పద్మశాలి సంఘాలు, మహిళలు, మధ్యతరగతి కుటుంబాలు, సామాజిక వర్గాలు ప్రభుత్వం, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నాయి.