బుల్లెట్ రైలు సాధన కోసం సూర్యాపేట కలెక్టరేట్ వద్ద వంటా-వార్పు
సూర్యాపేట, నవంబర్ 21 (విజయక్రాంతి) : సూర్యాపేట(Suryapet) మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్(Bullet Train Corridor), స్టేషన్ ఏర్పాటు చేయాలనీ కోరుతూ తెలంగాణ యువజన సంఘము(Telangana Youth Association) మరియు తెలంగాణ యువ సమితి(Telangana Youth Committee) ఆధ్వర్యంలో వంటా- వార్పు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు(Ananthula Madhu) మాట్లాడుతూ సూర్యాపేట ప్రజల చిరకాల ఆకాంక్ష కోసం అఖిల పక్షం ఆధ్వర్యంలో వివిధ పోరాట రూపాల లో 100 రోజుల పైగా సూర్యాపేట జిల్లా కేంద్రం లో ఉద్యమం జరుగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు నిమ్మకి నిరత్త నట్లు ఉన్నారని, సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడర్ మరియు స్టేషన్ ఏర్పాటు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేసారు.
రెండు తెలుగు రాష్టాల రాజధానుల మధ్య వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట కి బుల్లెట్ ట్రైన్ రాకుండా అడ్డుకోవడం అంటే సూర్యాపేట ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడమే అని. కేంద్రం ప్రకటించిన మొదటి అలైన్ మెంట్(Alignment) ప్రకారం సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ ప్రకటించే వరకు పోరాడుతామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర నాయకులు బషీపంగు సునీల్, తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిగా సంతోష్ రెడ్డి, తెలంగాణ యువజన సంఘము సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పోరెళ్ల విప్లవ్ కుమార్, తెలంగాణ యువజన సంఘము సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ సురేష్ నాయక్, తెలంగాణ యువజన సంఘము జిల్లా ఉపాధ్యక్షులు ధరవాత్ శివ నాయక్, తెలంగాణ యువజన సంఘము జిల్లా నాయకులు చామకూరి మహేందర్ మహేందర్, భాస్కర్ రెడ్డి, తెలంగాణ యువ సమితి జిల్లా ఉపధ్యక్షులు గడ్డం యాకుబ్ రెడ్డి, నాగు నాయక్, తదితరులు పాల్గొన్నారు.