బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పూజలు
21-11-2026 | 04:45pm
ఖానాపూర్ ( విజయక్రాంతి): ఖానాపూర్ పట్టణంలోని(Khanapur town) శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో(Sri Lakshmi Venkateswara Swamy Temple) నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్(Vedma Bojju Patel) స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.