రైతుల భూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
సబ్ కలెక్టర్ హర్ష చౌదరి
బెజ్జూర్,(విజయక్రాంతి): రైతుల భూ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ హర్ష చౌదరి అధికారులను ఆదేశించారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. ఇట్టి రెవెన్యూ సదస్సులో సబ్ కలెక్టర్ హర్ష చౌదరి రైతులు దరఖాస్తు చేసుకున్న భూ సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు 200 కు పైగా భూ సమస్యలపై ఆర్జీలు సమర్పించారు.
రైతులు అందించిన ఆర్జీలను అధికారులు రైతుల యొక్క పేర్లతో వినిపించి భూ సమస్యలను తెలుసుకొని న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తహసిల్దార్ రామ్మోహన్ రావుకు పరిష్కరించాలని సూచించారు. రాత్రి అయినప్పటికీ దూర ప్రాంతాల రైతులు భూముల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు ఆశతో సబ్ కలెక్టర్ భూ సమస్యల పరిష్కారం చేస్తారని నమ్మకంతో వేచి చూస్తున్నట్లు రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ బిమ్లా నాయక్, ఆర్ఐ రవీందర్, సీనియర్ అసిస్టెంట్ అచ్యుత్ రావు, సర్పంచులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.