అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ల మంజూరికీ కృషి
ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు
కాగజ్ నగర్,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ల మంజూరుకి కృషి చేస్తున్నట్లు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు(MLA Harish Babu) తెలిపారు. గురువారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయం(Kagaznagar Municipal Office)లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన లబ్ధిదారులకు పెన్షన్ ధ్రువ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
కాగజ్నగర్ మున్సిపాలిటీలో 785 మందికి పెన్షన్లు మంజూరు కాగా పెన్షన్ సర్టిఫికెట్లను జిల్లా కలెక్టర్ హరిత తో కలిసి పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి అందుతున్న ఆర్థిక తోడ్పాటును వృద్ధాప్య, వితంతు ,ఒంటరి మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్, ప్రజలు పాల్గొన్నారు.