కోర్టు వాయిదాలకు హాజరుకాని ముగ్గురికి జైలు శిక్ష
మహాదేవపూర్,(విజయక్రాంతి): కోర్టు కేసులకు సంబంధించి నిర్ణీత వాయిదాలకు హాజరుకాని ముగ్గురు వ్యక్తులను మహదేవపూర్ పోలీసులు(Mahadevpur Police) అదుపులోకి తీసుకుని గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు ఎస్సై ఎం సాంబమూర్తి తెలిపారు. అనంతరంన్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.
జైలుకు తరలించబడిన బ్రామ్మనపల్లికి చెందిన కాల్వ రాజ. సూరారం గ్రామానికి చెందిన దుర్గం నందు ఎడపల్లికి చెందిన కె.రాజ్ కుమార్ లు ఉన్నారు. కోర్టు కేసులు ఉన్న ప్రతి ఒక్కరూ నిర్ణీత తేదీలలో తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలి. కోర్టు నుంచి వచ్చే సమన్లు, నోటీసులను నిర్లక్ష్యం చేయకూడదని సరైన కారణం లేకుండా కోర్టు వాయిదాలకు గైర్హాజరు కావద్దు ఎస్సై తెలిపారు.
అనారోగ్యం లేదా ఇతర అత్యవసర కారణాల వల్ల హాజరు కాలేని పక్షంలో న్యాయవాది ద్వారా ముందుగానే కోర్టుకు సమాచారం అందించాలని చట్టాన్ని గౌరవిస్తూ, కోర్టు ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని మహదేవపూర్ ఎస్సై ఎం సాంబమూర్తి హెచ్చరించారు.