చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం
నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణకు సహకరించాలి
హుజూర్నగర్ సీఐ చరమందరాజు
గరిడేపల్లి,(విజయక్రాంతి): చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాల(Illegal Activities)కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హుజూర్నగర్ సీఐ చరమందరాజు(Huzurnagar CI Charamandaraju) హెచ్చరించారు. గురువారం గరిడేపల్లి పోలీస్ స్టేషన్(Garidepalli Police Station)ను సందర్శించిన ఆయన క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించి పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు.
సెల్ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కళాజాతరల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామాల్లో వ్యాపారులు, ప్రజలు కూడా తమ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అనంతరం పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో గరిడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.