పట్టర పట్టు హైలెస్స.. బస్సును నెట్టు హై లెస్సా..!

13-11-2026 | 12:13am

కాగజ్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం నడుపుతున్న పల్లె వెలుగు బస్సులు(Palle Velugu Bus) ఫిట్నెస్ లేక  ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. గురువారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్(Kagaznagar) బస్ స్టేషన్ లో పల్లె వెలుగు బస్సు బస్ స్టేషన్ నుంచి బయలుదేరే ముందు మధ్యలో  కదల లేక మొరాయించింది. దీంతో ప్రయాణికులు  బస్సును స్టార్ట్ చేసేందుకు  నెట్టడం ప్రారంభించారు. అయినప్పటికీ బస్సు ఎంతసేపటికి స్టార్ట్ కాలేదు. దీంతో డ్రైవర్, కండక్టర్లు, ప్రయాణికులు బస్సు నుండి దిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాగజ్నగర్ బస్ స్టేషన్ నుంచి బెజ్జూర్ మండల కేంద్ర మీదుగా కుకడ గ్రామానికి గురువారం మధ్యాహ్నం 1 గంటకు బస్సు బయలుదేరింది. కానీ బస్ స్టేషన్ కాంపౌండ్ దాటి రోడ్డు ఎక్కే క్రమంలో  బస్సు   TGS ( Z20--0022)ఆఫ్ అయింది. దీంతో గత్యంతరం  లేక  డ్రైవర్ ప్రయాణికులచే  బస్సును నెట్టాలని కోరారు. ప్రయాణికులు  తమ బలాన్ని ప్రయోగించి నెట్టినప్పటికీ .. ఎంతసేపటికి బస్సు స్టార్ట్ కాలేదు. దీంతో డ్రైవర్, కండక్టర్లు  ప్రయాణికులను దించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో  బస్సులు అవుట్ గోయింగ్ వెళ్లేందుకు దారి మూసుకుపోయింది.

మరిన్ని వార్తలు