మోడల్ దుర్గం స్వాతికి ఎమ్మెల్యే సన్మానం
04-11-2026 | 04:58pm
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ ఫ్యాషన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ స్పార్క్ మోడలింగ్(Telangana Spark Modeling) పోటీల్లో ఆసిఫాబాద్‌కు చెందిన దుర్గం స్వాతి మిసెస్ కేటగిరీలో ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి స్వాతిని ఘనంగా సన్మానించి అభినందించారు. మారుమూల ప్రాంతం నుంచి రాష్ట్రస్థాయి పోటీల్లో ఫైనల్‌కు చేరడం గర్వకారణమని, గ్రాండ్ ఫినాలేలో విజేతగా నిలిచి ఆసిఫాబాద్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.