స్వర్ణకార శంఖారావం బహిరంగ సభ పోస్టర్లు ఆవిష్కరణ
బెజ్జూర్ అక్టోబర్ 15 (విజయ క్రాంతి ): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో గురువారం స్వర్ణకార శంఖారావం(The Goldsmith’s Clarion Call) భారీ బహిరంగ సభ పోస్టర్లను స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నల్గొండ శ్రీరాములు చారి. ప్రధాన కార్యదర్శి శ్రీరాం వరప్రసాద్ చారి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 24న సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ పట్టణంలోని సరూర్నగర్ గ్రౌండ్లో స్వర్ణకార శంఖారావం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని అధిక సంఖ్యలో స్వర్ణకారులు హాజరై ఇట్టి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం మండల అధ్యక్షులు ఏలేశ్వరం శ్రీనివాస్ చారి,విశ్వబ్రహ్మణ సంఘం మండల అధ్యక్షుడు పురుషోత్తంచారి,చాకటి శ్రీధర్ చారి, ఏలేశ్వరం నరేష్ చారి,బట్టుపల్లి విలాస్ చారి,చిలుకూరు మహేష్ చారి, శ్రీరామ్ సురేష్ చారి,సతీష్ చారి, రాకేష్ చారి,గోపాల్ చారి ,సభ్యులు పాల్గొన్నారు.