ఉపాధి హామీ పనులపై ప్రత్యేక శిక్షణ

11-11-2026 | 05:36pm

బెజ్జూర్ నవంబర్ 11 (విజయక్రాంతి): బెజ్జూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో విబిజి రాంజీ(VBG Ramji Scheme)పై ఉపాధి హామీ మేట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల మేట్లు పాల్గొన్నారు. పనుల నిర్వహణ పని కొలతలు రికార్డుల నిర్వహణపై అధికారులు వివరించారు.

ఈ కార్యక్రమంలో విబిజి రాంజీ ఏపీవో మురళి ఈసీ నాగేష్ పాల్గొని మేట్లకు అవగాహన కల్పించారు. విబిజి రాంజీ పథకం ద్వారా గ్రామాల్లో ఉపాధి కల్పనతో పాటు త్రాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు నీటి సంరక్షణ వంటి స్థానిక అవసరాలకు సంబంధించిన పనులు చేపట్టబడుతాయన్నారు. ఈ శిక్షణ ద్వారా మెట్ల పనుల నిర్వహణలో మరింత జాగ్రత్త వహించి పని కొలతలు సరిగ్గా నమోదు చేసి పథకం లబ్ధిదారులకు సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు.

మరిన్ని వార్తలు