హైదరాబాద్‌లో కొత్త రూల్
ఇల్లు, స్థలం కొంటున్నారా? ఈ నంబర్ తప్పనిసరి
PTIN ఉంటేనే స్లాట్ బుకింగ్.. ప్రభుత్వం కొత్త రూల్
హైదరాబాద్: ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ఆస్తుల Registration చేయించుకోవాలంటే ఇకపై Property Tax Identification Number (PTIN) లేదా ఖాళీ స్థలాలకు Vacant Land Tax Identification Number (VLTIN) తప్పనిసరి. ఈ నంబర్ లేకుంటే Registration Slot Booking కూడా సాధ్యం కాదు. స్లాట్ బుకింగ్ సమయంలోనే PTIN వివరాలు నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్‌తో పాటు Property Mutation ఆటోమేటిక్‌గా పూర్తయ్యేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే PTIN ఉన్న ఆస్తులకు పన్ను బకాయిలు ఉన్నా రిజిస్ట్రేషన్ ఆగదు. బకాయిల వివరాలు కొనుగోలుదారుడికి, మున్సిపల్ అధికారులకు SMS ద్వారా తెలియజేస్తారు.
ఆస్తికి PTIN లేకుంటే రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొదటిది.. మున్సిపల్ అధికారులు 48 గంటల్లో Tax Assessment పూర్తి చేసి నంబర్ కేటాయించిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవడం. రెండోది.. Pending Registration విధానం ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తిచేసి, పన్ను మదింపు, బకాయిల చెల్లింపు అయ్యే వరకు అసలు Documentను పెండింగ్‌లో ఉంచడం. అయితే నిర్మాణ దశలో ఉన్న అపార్ట్మెంట్లు, కొత్తగా పూర్తయిన భవనాలకు PTIN కేటాయింపులో ఆలస్యం జరిగితే రిజిస్ట్రేషన్లపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 48 గంటల్లో మున్సిపల్ అధికారులు పన్ను మదింపు పూర్తి చేయకపోతే కొనుగోలుదారుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొత్త నిబంధనలతో Property Tax వసూళ్లు మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఏర్పడే ఇబ్బందులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.