బ్రాహ్మణుల రాజకీయ ప్రస్థానం.. ప్రాభవం నుంచి పతనం దిశగా!

12-11-2026 | 05:30am
  1. శతాబ్దాలుగా మేధోరంగంలో విశిష్టస్థానం 
  2. రాజకీయాల్లోనూ తిరుగులేని ప్రాభవం 
  3. మండల్ రాజకీయాలతో మారిన సామాజిక సమీకరణలు 
  4. సంప్రదాయ మిత్రవర్గాలకు క్రమంగా దూరం 
  5. మసకబారిన మిథిల వైభవం 
  6. ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో చర్చ

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): శతాబ్దాల పాటు విద్య, వైద్యం(Education, Healthcare), సాహిత్యం, పరిపాలనా రంగాల్లో దిక్సూచిగా నిలిచి, సమాజ గమనాన్ని నిర్దేశించిన బ్రాహ్మణ సామాజిక వర్గ(Brahmin social class) ప్రస్థానం ఇప్పుడు కీలక మలుపు తిరిగిందా?, ఒకప్పుడు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ఆదరాభిమానాలను చూరగొన్న ఈ వర్గం.. నేడు మారుతున్న రాజకీయ విధానాలు(Political Policies), కొత్త కుల సమీకరణాలు, సిద్ధాంతపరమైన విభేదాల సుడిగుండంలో చిక్కుకుందా?, తన సంప్రదాయ సామాజిక పునాదులను, రాజకీయ ప్రాబల్యాన్ని క్రమంగా కోల్పోతోందా?.. ఇటీవల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(Political strategist Prashant Kishor) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ ప్రశ్నలను మరోసారి తెరపైకి తెచ్చాయి.

బిహార్‌లోని మిథిలా ప్రాంతం దర్భంగాలో జరిగిన సభలో జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే ప్రశాంత్ కిశోర్ ఈ వర్గాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బ్రాహ్మణులు తమ సంప్రదాయ బలాలైన జ్ఞానం, విజ్ఞత, మేధోపటిమను తిరిగి సంతరించుకోవాలని, ఇతర సామాజిక వర్గాలతో సత్సం బంధాలను కొనసాగించాలని సూచించారు. గతంలో ఈ ప్రాంతంలో దాదాపు 18 శాతం మంది ముస్లింలు రాజకీయపరంగా బ్రాహ్మణ వర్గానికి మద్దతు ఇచ్చేవారని ప్రశాంత్ కిశోర్ గుర్తుచేశారు.

అయితే, బ్రాహ్మణుల్లోని కొన్ని వర్గాలు బీజేపీకి చేరువై, ముస్లింల పట్ల ఘర్షణా త్మక వైఖరిని అవలంబించాయని, తద్వారా ముస్లింలు క్రమంగా బ్రాహ్మణులకు దూరమైనట్లు పేర్కొన్నారు. ఒకప్పుడు పండితులు, మేధా వులకు నిలయంగా పేరుగాంచిన మిథిలా ప్రాంతం నేడు ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి లేమి, వలసలతో సతమతమవుతోందని తెలిపారు.  

శతాబ్దాలుగా విశిష్ట స్థానం

శతాబ్దాల పాటు భారతీయ సమాజంలో బ్రాహ్మణులు విశిష్ట స్థానాన్ని ఆక్రమించారు. జ్ఞానానికి, వేద విజ్ఞానానికి, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు, రాజనీతికి మార్గదర్శకులుగా వ్యవహరించారు. రాజులకు పాలన, రాజ్యనిర్వహణ, ధర్మం, నైతిక విలువలపై సలహాలిచ్చేవారు. తరతరాలకు విద్యాబోధన చేయడం, విస్తృతమైన విజ్ఞాన సంపదను వ్యవస్థీకరించడం, పరిపాలనా, నైతిక వ్యవస్థల రూపకల్పనలో కీలక సలహాదారులుగా వ్యవహరించారు. ప్రాచీన భారతదేశం గణితం, ఖగోళశాస్త్రం, వైద్యం తదితర రంగాల్లో సాధించిన అనేక విజయాల్లో బ్రాహ్మణ పండితులు, ఋషుల పాత్ర విశేషంగా కనిపిస్తుంది.

గణితం, ఖగోళ శాస్త్ర రంగాల్లో ఆర్యభట్ట 5వ శతాబ్దంలోనే భూమి తన అక్షంపై తిరుగుతుందని వివరించడంతో పాటు, ‘పై’ విలువను అత్యంత కచ్చితత్వంతో గణించారు. బ్రహ్మగుప్తుడు శూన్యం, రుణ సంఖ్యలకు సంబంధించిన గణిత నియమాలను క్రమబద్ధీకరించి, ఆధునిక గణితానికి పునాదులు వేశారు. అనంతరం దశాంశ స్థానవిలువ పద్ధతి ప్రపంచ గణన విధానాలపై విశేష ప్రభావం చూపింది. వైద్య రంగంలో చరకుడు రచించిన ‘చరక సంహిత’ వ్యాధి నిర్ధారణ, రోగ లక్షణాలు, చికిత్స విధానాలకు సంబంధించిన సమగ్ర వైద్య గ్రంథంగా ఆయుర్వేదంలో విశిష్ట స్థానం సంపాదించింది.

సుశ్రుతుడు శస్త్ర చికిత్స పద్ధతులు, వైద్య పరికరాలు, ప్లాస్టిక్ సర్జరీ, కంటిశుక్ల శస్త్ర చికిత్స వంటి ప్రక్రియలను వివరించి, ప్రాచీన శస్త్ర చికిత్స వైద్యానికి మార్గదర్శకుడిగా గుర్తింపు పొందారు. పతంజలి యోగాను శరీరం, మనస్సును సమన్వయం చేసే క్రమశిక్షణతో కూడిన సాధన మార్గంగా వ్యవస్థీకరించారు. కౌటిల్యుడు (చాణక్యుడు) రచించిన ‘అర్థశాస్త్రం’ రాజ్యపాలన, ఆర్థిక విధానాలు, దౌత్యనీతి, పరిపాలనకు సంబంధించిన సమగ్ర గ్రంథంగా మౌర్య సామ్రాజ్య పాలనలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు, చార్వాకుల వంటి భిన్న తాత్విక దక్పథాలను ప్రతిపాదించిన ఆలోచనాపరులు భౌతికవాద తత్వాన్ని ముందుకు తెచ్చారు. ఆయా రంగాల్లో బ్రాహ్మణులు చేసిన విశేష కృషి వారికి దేశవ్యాప్తంగా విశిష్ట గుర్తింపును తెచ్చిపెట్టింది.

స్వాతంత్రోద్యమంలో మార్గదర్శకత్వం

భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ జాతీయవాద భావజాల వ్యాప్తికి, ప్రజలను సమీకరించడానికి బ్రాహ్మణ నాయకులు మేధోపరమైన మార్గదర్శకత్వం వహించారు. బాలగంగాధర తిలక్ పత్రికలు, బహిరంగ వేదికల ద్వారా స్వరాజ్య నినాదాన్ని బలంగా వినిపిస్తూ, జాతీయ సాంస్కతిక చైతన్యాన్ని పునరుజ్జీవింపజేశారు. గోపాలకృష్ణ గోఖలే రాజ్యాంగబద్ధమైన మార్గాలు, విద్య, సామాజిక సంస్కరణలను మార్పునకు ప్రధాన సాధనాలుగా భావించారు. మదన్ మోహన్ మాలవ్య ఆధునిక విద్యతో పాటు భారతీయ సాంస్కతిక విలువలకు ప్రాధాన్యమిచ్చే విద్యాసంస్థల స్థాపనకు కృషి చేశారు.

భాషపై పట్టు, మేధోపరమైన శిక్షణ, విద్యాభ్యాసం కారణంగా ఈ నాయకులు బ్రిటిష్ పాలకులతో చర్చలు జరపడం, వినతిపత్రాలు రూపొందించడం, స్వాతంత్రోద్యమానికి అవసరమైన సంస్థాగత నిర్మాణాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. 19వ శతాబ్ద్దాం చివరిలో, 20 శతాబ్దం తొలి దశలో విద్యావంతులైన ఉన్నత వర్గాల్లో బ్రాహ్మణుల ప్రాతినిధ్యం గణనీయంగా ఉండటానికి వారి విద్యా సంప్రదాయాలు కూడా కారణమయ్యాయి.

సామాజిక సంబంధాలు బలహీనం 

కాలక్రమేణ సమాజంలోని కొన్ని వర్గాలు జ్ఞాన సముపార్జన, సామాజిక సామరస్యం, విస్తృత సంబంధాల పరిరక్షణ కంటే కులపరమైన గుర్తింపు, రాజకీయ సమీకరణాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి.  ఉపాధ్యాయులు, పండితులు, సలహాదారులుగా బ్రాహ్మణులు సంపాదించిన గౌరవం మేధోపరమైన ప్రామాణికతతో పాటు అన్ని వర్గాలతో సమతుల్య సంబంధాలను కొనసాగించగల సామర్థ్యంపై ఆధారపడి ఉండేది. అయితే, సంభాషణకు బదులుగా ఘర్షణాత్మక రాజకీయ వ్యాఖ్యానాలకు ప్రాధాన్యమిచ్చినప్పుడు గతంలో ఏర్పడిన సామాజిక మద్దతు బలహీనపడటం సహజం.

కొన్ని ప్రాంతాల్లో ముస్లిం ఓటర్ల మద్దతు కోల్పోవడాన్ని కిశోర్ ప్రస్తావించడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోం ది. సామాజిక సంబంధాలను విస్తరించాల్సిన చోట రాజకీయ వైఖరులు వాటిని కుదించివేస్తే, గతంలో లభించిన సామాజిక ప్రాబల్యం కూడా క్రమంగా తగ్గిపోతుంది.  నేటి బహిరంగ చర్చల్లో గత వైభవాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నప్పటికీ, ఆధునిక శాస్త్ర సాం కేతిక రంగాలు, విద్య, ప్రజాసేవలో సమాజం నుంచి వెలువడుతున్న సమకాలీన కృషికి తగినంత ప్రాధాన్యం లభించడం లేదన్న అభిప్రాయం కూడా ఉంది.

సామాజిక మాధ్యమాలు సైతం ఒకవైపు పూర్వీకుల ఘనతను కీర్తిస్తూనే, మరోవైపు ప్రస్తుత పరిస్థితులపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దీంతో బ్రాహ్మణ సామాజిక పతన భావన మరింత బలపడుతోంది. కాగా, ప్రశాంత్ కిశోర్ ప్రసంగం చారిత్రక ప్రాభవానికి, ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న అంతరాన్ని ఆయన ప్రశ్నించడమే. జ్ఞానానికి, విజ్ఞతకు నిలయంగా ఉన్న తమ చారిత్రక పాత్రను బ్రాహ్మణులు గుర్తుచేసుకోవాలని, ఇతర సామాజిక వర్గాలతో సంబంధాలు దెబ్బతినడం వల్ల కలిగే పరిణామాలను అర్థం చేసుకోవాలని ఆయన చేసిన సూచనలు ఆత్మపరిశీలనకు ఆహ్వానిస్తున్నాయి. 

రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నా.. ఆర్థిక భద్రత శూన్యం 

స్వాతంత్య్రం అనంతర బ్రాహ్మణుల సామాజిక, ఆర్థిక ఆధిపత్యం క్రమంగా తగ్గుతూ వస్తుంది. అనేక ప్రాంతాల్లో భూ సంస్కరణలు వారి సంప్రదాయ ఆర్థిక పునాదులను బలహీనపరిచాయి. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సమాజంలోని విస్తృత వర్గాలకు అందుబాటులోకి రావడంతో అక్షరాస్యత, ప్రభుత్వ ఉద్యోగాలు, పరిపాలనా రంగాల్లో ఒకప్పుడు ఉన్న ఆధిపత్యం తగ్గింది. వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అమల్లోకి వచ్చిన రిజర్వేషన్ విధానాలు కూడా విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలను గణనీయంగా మార్చాయి.

బిహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జనాభా నిర్మాణం, సామాజిక న్యాయ ఉద్యమాలు, రాజకీయ పరిణామా లు ఈ మార్పును మరింత వేగవంతం చేశాయి. ఒకప్పుడు పాండిత్యానికి ప్రతీకగా నిలిచిన మిథిలా ప్రాంతంలో సైతం నేడు అనేక బ్రాహ్మ ణ కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ ఆర్థిక భద్రత లభించడం లేదని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు