ఎస్ఈడబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రసాద్స్ కంపెనీలకు భారీ ఊరట
నిధుల మళ్లింపు కేసు ముగింపు
మనీలాండరింగ్ కేసును కూడా మూసివేసిన ఈడీ
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): ఎస్ఈడబ్ల్యూ ఎల్ఎస్వై హైవేస్ లిమిటెడ్(SEW LSY Highways Limited), దాని ప్రమోటర్ సంస్థలైన(Promoter entity) ఎస్ఈడబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ప్రసాద్స్ అండ్ కంపెనీకి(Prasads and Company) భారీ ఊరట లభించింది. ఈ సంస్థలపై నమోదైన కేసుల్లో ఎలాంటి చర్య లు లేకుండానే విచారణ ప్రక్రియ ముగిసింది. 2025 డిసెంబరులో హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు(CBI Court) ఉత్తర్వుల మేరకు, ఎస్ఈడబ్ల్యూ ఎల్ఎస్వై హైవేస్ లిమిటెడ్, దాని ప్రమోటర్ సంస్థలకు సంబంధించిన కేసులో సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును కోర్టు ఆమోదించింది.
నిందితులపై కేసు నమోదు(Case registration) చేయడానికి తగిన ఆధారాలు లేవ ని పేర్కొంటూ విచారణను ముగించాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లోని స్టేట్ హైవే-57ను నాలుగు వరుసల రహదారిగా విస్త రించే ప్రాజెక్టును రద్దు చేసిన నేపథ్యంలో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. ఈ వ్యవహారంలో నేరపూరిత కుట్ర, మోసం, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టిం ది. అయితే, దర్యాప్తు అనంతరం ఎలాంటి నిధుల మళ్లింపు జరిగినట్లు నిర్దిష్ట ఆధారాలు లభించలేదని క్లోజర్ రిపోర్టులో పేర్కొంది.
ఈ రిపోర్టును పరిశీలించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కమ్ స్పెషల్ సెషన్స్ జడ్జి, సీబీఐ హైదరాబాద్ కోర్టు.. నిధుల మళ్లింపుపై నిర్దిష్టమైన ఆధారాలు లేవని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సీబీఐ కేసు ముగిసిన అనంతరం, మనీలాండరింగ్ ఆరోపణలపై ఎస్ఈడబ్ల్యూ ఎల్ఎస్వై హై వేస్ లిమిటెడ్, దాని ప్రమోటర్ సంస్థలపై ఈడీ ప్రారంభించిన విచారణను కూడా ఈ ఏడాది మే నెలలో ముగించింది. నాలుగు వరుసల రహదారి ప్రాజెక్టు రద్దు నేపథ్యం లో విచారణల పరిధిలోకి వచ్చిన ఎస్ఈడబ్ల్యూ, దాని ప్రమోటర్ సంస్థలకు సీబీఐ, ఈడీ కేసుల ముగింపుతో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఊరట లభించినట్లయింది.