కొత్త వివాదం
రాహుల్ అమెరికా టూర్.. ఎవరితో భేటీ? బీజేపీ ప్రశ్నల వర్షం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi US Visit) అమెరికా పర్యటన రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ నెల 17, 18 తేదీల్లో ఆయన USలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ యూనివర్సిటీల్లో విద్యార్థులతో ప్రత్యేక చర్చల్లో పాల్గొననున్నారు. అయితే ఈ Tourపై బీజేపీ ప్రశ్నలు లేవనెత్తడంతో Political Heat పెరిగింది. నవంబర్ 17న న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో జరిగే Fireside Chatలో రాహుల్ పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న Student Movements, వాటి ప్రభావం, Democracyపై వాటి పాత్ర వంటి అంశాలపై చర్చించనున్నారు. విద్య, ఉపాధి, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి.
అనంతరం నవంబర్ 18న చికాగో యూనివర్సిటీలో(University of Chicago) ప్రముఖ రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ రాబర్ట్ పేప్తో రాహుల్ సంభాషించనున్నారు. ఈ సమావేశంలో International Affairs, Geopolitics, మధ్యప్రాచ్య పరిణామాలు, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత విదేశాంగ విధానం వంటి అంశాలపై చర్చ జరగనుంది. ఈ కార్యక్రమాలు యూనివర్సిటీల ద్వారా ప్రసారం కానున్నాయి. ఇదిలా ఉంటే.. రాహుల్ అమెరికా పర్యటనపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆయన విద్యార్థులతోనే సమావేశమవుతారా? లేక భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే శక్తులతోనూ భేటీ అవుతారా? అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ఈ పర్యటనలో ఎవరెవరిని కలవబోతున్నారు? సమావేశాల ఉద్దేశం ఏమిటి? అనే వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా మాత్రం ఈ పర్యటన ప్రధానంగా Academic Discussions కోసమేనని స్పష్టం చేశారు. మొత్తంగా రాహుల్ అమెరికా పర్యటనలో చేసే వ్యాఖ్యలు, అక్కడి సమావేశాలు, బీజేపీ విమర్శలు రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.