పీవీపై అక్కసుతోనే ఇంటర్ రద్దు!
- అందరితో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలి
- లేదంటే ఉద్యమం చేపడతాం
- ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డా. పీ మధుసూదన్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై( Prime Minister PV Narasimha Rao) అక్కసుతోనే ఇంటర్ విద్యను రద్దు చేస్తున్నారని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పీ మధుసూదన్ రెడ్డి(Madhusudan Reddy) ఆరోపించారు. వచ్చే ఏడాది నుంచి 12వ తరగతి వరకు విద్యావిధానం అమలు(Implementation of the Education Policy) చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటించింది. దీనిపై మధుసూదన్‌రెడ్డి(Madhusudan Reddy) స్పందించారు. పీవీ మానసపుత్రికగా పేరున్న ఇంటర్ విద్య(Intermediate Education) 1969--70 నాటి దౌలత్ సింగ్ కొఠారి కమిషన్ సిఫారసు మేరకు 10+2+3 విధానం పురుడు పోసుకున్నదని పేర్కొన్నారు.
నాటి నుంచి నేటి వరకు ఎన్నో విద్యాభివృద్ది సంచలనాలను ఇంటర్ విద్య నమోదు చేసిందని, ఐఐటీ, ఎన్ఐటీ, ఆల్ ఇండియ మెడికల్ సైన్సెస్‌లో ఇంటర్ విద్యార్థులు రాణిస్తున్నారని తెలిపారు. కేవలం పీవీ మీద అక్కసుతో వారి ఆనవాళ్లను చెరిపివేయాలని ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయాలనుకోవడం దురదృష్టకరమన్నారు. సీబీఎస్ఈలో కూడా పదవతరగతిలో 25 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే.. దాదాపు ఏడున్నర లక్షల మంది డ్రాపౌట్ అయి, ఇంటర్ విద్యను ఎంచుకుంటున్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గమనించాలని ఆయన కోరారు.