ప్రభుత్వాసుపత్రులపై సర్కార్ నిర్లక్ష్యం
రెండేళ్లయినా టిమ్స్ అల్వాల్లో అడుగు ముందుకు పడలే: క్రిశాంక్
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి) : కాంగ్రెస్ అధికారంలోకి(Congress in power) వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వ ఆసుపత్రుల(Government hospitals) నిర్మాణ పనుల్లో ఆశించిన పురోగతి లేదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్(Manne Krishank) విమర్శించారు. టిమ్స్ అల్వాల్(TIMS Alwal) నిర్మాణ పనులపై ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ కంటోన్మెంట్ నాయకులతో కలిసి మన్నె క్రిశాంక్(Manne Krishank) బుధవారం టిమ్స్ అల్వాల్ను సందర్శించారు.
2025 జనవరిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్పెషల్ సెక్రటరీ వికాస్రాజ్తో కలిసి టిమ్స్ అల్వాల్ను సందర్శించి 90 శాతం పనులు పూర్తయ్యాయని, అదే ఏడాది ఆగస్టు 31 నాటికి ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. తాజాగా మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహ ఆసుపత్రిని సందర్శించి మళ్లీ అవే ప్రకటనలు చేయడం విడ్డూరమన్నారు. దాదాపు 20 నెలల వ్యవధిలోనూ పనుల పురోగతిపై అదే 90 శాతం ప్రకటన రావడం చూస్తుంటే, ఈ కాలంలో జరిగిన అభివృద్ధి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోందన్నారు.