25 ఏళ్లు కోలుకోలేరు

12-11-2026 | 07:37am

ఇరాన్‌కు అణ్వాయుధం దక్కకుండా అడ్డుకున్నాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్: అమెరికా సైనిక బలగాలే ఇరాన్ అణ్వాయుధ శక్తిగా ఎదగకుండా అడ్డుకున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) పేర్కొన్నారు. ఇరాన్‌పై తమ ప్రభుత్వం తీసుకున్న Military Actionతో ఆ దేశ అణు కార్యక్రమానికి తీవ్ర నష్టం కలిగిందని ఆయన వెల్లడించారు. అమెరికా ఇప్పటివరకు అనుసరించిన వైఖరిని సమర్థించుకుంటూ, ఇరాన్‌కు అణ్వాయుధం దక్కకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నవంబర్ 11న నిర్వహించిన Veterans Day వేడుకల్లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా ప్రారంభించలేదని, 1979 నుంచి ఆ దేశం అమెరికాపై వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్‌కు గట్టిగా సమాధానం ఇచ్చామని, అమెరికా బలగాలు తీవ్రంగా పోరాడి విజయం సాధించాయని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా B-2 Stealth Bombers దాడులను ప్రస్తావించిన ట్రంప్.. ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీశామని పేర్కొన్నారు. తమ దాడుల వల్ల ఇరాన్ తిరిగి పుంజుకోవడానికి సుమారు 25 ఏళ్లు పట్టవచ్చని అంచనా వేశారు. యుద్ధంలో Partial Victory కాకుండా పూర్తి విజయం సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మరోవైపు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికులకు ట్రంప్ నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగాలు, ధైర్యసాహసాలను కొనియాడారు. ఈ పోరాటం ముగిసిన తర్వాత ప్రపంచం మరింత సురక్షితంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా ధ్వంసమైందన్న ట్రంప్ వాదనపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు