దావోస్ తరహాలో హైదరాబాద్

12-11-2026 | 05:35am

ప్రపంచ విధాన చర్చలకు వేదిక 

భారత్ సమ్మిట్‌తో రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలపై ప్రపంచానికి దిశానిర్దేశం 

13, 14 తేదీల్లో భారత్ సమ్మిట్ 

70 దేశాల నుంచి వెయ్యి మందికిపైగా ప్రతినిధుల భాగస్వామ్యం 

మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి 

సదస్సులో ప్రపంచ సమస్యలపై చర్చలే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు 

* ప్రపంచ ప్రజాస్వామ్యవాదులు, ఉ దారవాదులు, ప్రగతిశీల భావాలు కలి గినవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి.. ప్రస్తుత ప్రపంచ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడమే భారత్ సమ్మిట్-2 ఉద్దేశం. గాంధీ బోధించిన అహింసా సిద్ధాంతం, నెహ్రూ అను సరించిన అలీన విదేశాంగ విధానం, మిశ్రమ ఆర్థిక విధానాలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి ఎంతో అవసరం.

డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): ప్రపంచ ఆర్థిక, పెట్టుబడుల(Global finance and investment) చర్చలకు దావోస్ వేదికగా(Davos Forum) నిలుస్తున్నట్లే.. రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలపై(Political, social, and economic policies) అంతర్జాతీయ చర్చలకు హైదరాబాద్ వేదిక కానుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హింస, విద్వేష రాజకీయాలు, విభజన ధోరణుల నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే లక్ష్యంగా ఈ నెల 13, 14 తేదీల్లో భారత్ సమ్మిట్- నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ ప్రజాస్వామ్యవాదులు, ఉదారవాదులు, ప్రగతిశీల భావాలు కలిగినవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి, ప్రస్తుత ప్రపంచ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడమే సదస్సు ఉద్దేశమని వివరించారు. 70కి పైగా దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రజాప్రతినిధులు, విధాన నిర్ణేతలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొననున్నారని వెల్లడించారు.

మంగళవారం హైదరాబాద్‌లోని హైటెక్స్ నోవాటెల్‌లో ఏఐసీసీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, మంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం, జవహర్‌లాల్ నెహ్రూ జయంతి నేపథ్యంలో భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గాంధీ బోధించిన అహింసా సిద్ధాంతం, నెహ్రూ అనుసరించిన అలీన విదేశాంగ విధానం, మిశ్రమ ఆర్థిక విధానాలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి ఎంతో అవసరమని, వీటిపై సదస్సులో చర్చించనున్నట్లు చెప్పారు. కొన్ని అగ్రరాజ్యాలకు అనుగుణంగా వ్యవహరించే క్రమంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ స్వతంత్ర గుర్తింపు, అస్తిత్వాన్ని కోల్పోకూడదన్నదే నెహ్రూ ఆలోచన అని పేర్కొన్నారు. 

భారత్ స్వశక్తితో ఎదగడమే కాకుండా ప్రపంచంలోని ప్రగతిశీల, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నాయకత్వం వహించాలన్న ఆయన దూరదృష్టి దేశానికి బలమైన పునాదులు వేసిందన్నారు. పంచవర్ష ప్రణాళికలు, ఇతర ఆర్థిక విధానాలు దేశాన్ని బలోపేతం చేశాయని, నేడు ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు గుర్తింపు రావడంలో నెహ్రూ విధానాల పాత్ర కీలకమని వివరించారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఉన్నట్లే ప్రతిపక్షం కూడా ఉండాలని, ఈ రెండూ ప్రజాస్వామ్య వ్యవస్థకు రెండు కీలక స్తంభాలని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్ష పార్టీలను, నాయకులను శత్రువులుగా చూడకూడదని, కేవలం తమతో విభేదించే రాజకీయ ప్రత్యర్థులుగానే భావించాలని సూచించారు. ప్రతిపక్షాల ఆలోచనలు, విధానాలను వ్యతిరేకించాలే తప్ప, వారిని శత్రువులుగా పరిగణించడం ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు.

ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రతిపక్ష పార్టీలను శత్రు వులుగా చూస్తున్నారని, వాటిని, వాటి నాయకత్వాన్ని రాజకీయంగా అంతం చేయాలనే ప్రయ త్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో అధికార, ప్రతిపక్షాలు రెండూ సమర్థవంతంగా కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను బలంగా విశ్వసిస్తుందని, ఈ అంశాలపై చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలను, నాయకులను భారత్ సమ్మిట్‌కు ఆహ్వాని స్తున్నామని భట్టి తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం అత్యంత ప్రాథమికమైన రాజ్యాంగ హక్కు అని, అయితే ‘సర్’ పేరుతో అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఓటు హక్కు కోల్పోయే ప్రమా దం ఉన్న ప్రతి పౌరుడి తరఫున పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఏఐసీసీ అడ్మినిస్ట్రేషన్ ఇంఛార్జి గురుదీప్ సింగ్ సప్పల్, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, సమృద్ధ భారత్ ఫౌండేషన్ డైరెక్టర్ పుష్పరాజ్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. 

రాహుల్ రీలాంచ్ అవసరమే లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): భారత్ సమ్మిట్‌ను రాహుల్ రీలాంచ్ కోసం నిర్వహిస్తున్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్య లు వారి అవగాహనారాహిత్యానికి నిదర్శనమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. కాం గ్రెస్ పార్టీ ప్రగతిశీల భావజాలంతో ముందుకెళ్లుందని,  రాహుల్‌గాంధీని మళ్లీ పరిచయం చే యాల్సిన అవసరం లేదని, ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడని పేర్కొన్నారు.  బీజేపీ ఆలోచనలు వేరని, వారి భావజాలమేం టో అందరికీ తెలుసన్నారు. మోదీ తర్వాత ఎవరిని లాంచ్ చేయాలా అని బీజేపీ వెతుకు లాడుతుందా? అని ప్రశ్నించారు.

రాహుల్‌గాంధీ ఆలోచనా విధానం బీజేపీకి ఎప్పటికీ అర్థం కాదన్నారు. భారత్ సమ్మిట్‌ను రాజకీయ కోణంలో చూడకూడదని,ప్రపంచం ఎదుర్కొం టున్న సమస్యలపై చర్చించి, పరిష్కార మార్గా లు చూపాలన్నదే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇది ఎకనామిక్ సమ్మిట్‌లా ఉపయోగపడుతుందని, ఈ సదస్సులో ఆర్థిక అంశాల తోపాటు యు వత, సాంకేతికత తదితర సమస్యలపైనా చర్చిస్తామని తెలిపారు. ఓటరు జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో కేంద్రం చేపడుతున్న చర్యలపైనా మేధోమథనం ఉం టుందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు