అగ్గిపెట్టె దొరకలేదా హరీశ్? కవిత ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి (Political Controversy). తెలంగాణ ఉద్యమ సమయంలో సుమారు 1,200 మంది అమరులయ్యారని పేర్కొన్న కవిత.. వారిలో పలువురికి న్యాయం జరగలేదని విమర్శించారు. ఉద్యమ సమయంలో అమరులైన వారికి అగ్గిపెట్టె దొరికిందని, గ్యాస్ నూనె పోసుకున్న హరీశ్‌రావుకు మాత్రం అగ్గిపెట్టె దొరకలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు (Harish Rao).
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని కవిత ఆరోపించారు. మొత్తం 1,200 మంది అమరులైతే కనీసం 600 కుటుంబాలకు కూడా ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. అమరవీరుల త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వడంతోపాటు వారి కుటుంబాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వ్యాఖ్యానించారు.
సిద్దిపేటలో జరిగిన పార్టీ కార్యాలయ నిర్మాణ కార్యక్రమం సందర్భంగా కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే హరీశ్‌రావుపై పలు ఆరోపణలు చేసిన ఆమె, తాజాగా తెలంగాణ అమరవీరుల అంశాన్ని ప్రస్తావిస్తూ విమర్శల తీవ్రత పెంచారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట రాజకీయాల్లోనూ తమ పార్టీ ప్రభావం చూపిస్తుందని ప్రకటించారు (Municipal Elections).
తెలంగాణ ఉద్యమ త్యాగాలు, అమరవీరుల కుటుంబాలకు అందిన పరిహారం, ఉద్యోగాల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారాయి. కవిత చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.