దూసుకొస్తున్న 'ఆక్వాన్' తుఫాన్

15-11-2026 | 11:25am

తెలుగు రాష్ట్రాల వైపు తుపాను.. 20 నుంచి వర్షాల ముప్పు!

హైదరాబాద్‌: బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న Well-marked Low Pressure క్రమంగా అల్పపీడనం నుంచి వాయుగుండంగా మారి, ఆ తర్వాత తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుపానుగా మారితే దీనికి ‘అక్వాన్ (Akvan)’ అనే పేరు పెట్టనున్నారు. ఈ Weather System ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుందనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ వ్యవస్థ నవంబర్ 16 లేదా 17 నాటికి Cyclonic Stormగా బలపడే అవకాశం ఉంది. అనంతరం ఉత్తర దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరంవైపు వచ్చే అవకాశాలున్నాయి. అయితే తుపాను ఎక్కడ తీరం దాటుతుంది? దాని తీవ్రత ఎంత ఉంటుంది? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంచనాల్లో నవంబర్ 19 ప్రాంతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంగా కదిలే అవకాశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.

తెలంగాణలో ఈ జిల్లాలకు వర్ష సూచన!

ఈ వ్యవస్థ ప్రభావంతో నవంబర్ 20 నుంచి 22 మధ్య తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాథమిక Weather Forecastలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. మిగిలిన జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

నవంబర్ 20, 21 తేదీల్లో తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. 21, 22 తేదీల్లో ఇతర ప్రాంతాల్లోనూ జల్లులు పడే అవకాశం ఉంది. అయితే వాతావరణ వ్యవస్థ కదలికలు, తీవ్రతలో మార్పులను బట్టి ఈ Forecast మారవచ్చు. ప్రజలు, రైతులు, మత్స్యకారులు తాజా IMD Weather Updatesను గమనిస్తూ ఉండాలి.

మరిన్ని వార్తలు