పీఆర్సీని అమలు చేయాలి

15-11-2026 | 05:10am
  1. 42 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలి
  2. టీజీవో డిమాండ్ 

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): రెండవ వేతన సవరణ కమిషన్(Pay Revision Commission) (పీఆర్సీ) రిపోర్టును తెప్పించుకుని, 42 శాతం ఫిట్మెంట్‌ను వెంటనే అమలు చేయాలని టీజీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ (టీజీవో) రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం నాంపల్లిలోని టీజీవో భవన్‌లో జరిగింది.

ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం ప్రతినెలా చెల్లిస్తున్న 1000 కోట్లు పెండింగ్ బకాయిలను 2000 కోట్లకు పెంచి విడుదల చేయాలని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాల అధికారుల అధికారిక విధి నిర్వహణ కోసం వినియోగిస్తున్న ప్రైవేట్ అద్దె వాహనాల (హైరింగ్ వెహికిల్) నెలవారి ఛార్జీలను ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరించి కనీసం రూ. 60 వేలకు పెంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని అన్ని విభాగాల డీపీసీలను ఏర్పాటు చేసి ప్రమోషన్ త్వరితగతిన ఇప్పించాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉన్న పర్మనెంట్ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం గుర్తింపును వెంటనే పునరుద్దరించాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు